జూన్ 26, 2026

IMG 20241107 WA0024

TRINETHRAM NEWS

వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్* అన్నారు. ఈరోజు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి తో కలిసి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని .22వ వార్డు, 23వ వార్డు ఆలంపల్లిలో వాటర్ సప్లై పైప్ లైన్ పనులను మరియు సింటెక్స్ ట్యాంకుల ఏర్పాటు పనులను చైర్ పర్సన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అలాగే 24వ వార్డులో యుజిడి పైప్ లైన్ పనులు మరియు మ్యాన్ హోల్స్ ఏర్పాట్ల పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు కిరణ్ పటేల్, కలాల్ ప్రభావతి, డిఈ రాకేష్ రెడ్డి, నాయకులు సదానంద్ రెడ్డి, సురేష్ గౌడ్, సర్ఫరాజ్, ఆనంద్, జాకీర్, సిద్దిక్, ఇర్ఫాన్, అజీ పాషా, రజాక్, బాబ్జీ, ఉమాకాంత్, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page