ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 11 06 at 13.07.21

TRINETHRAM NEWS

అధికారులు కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళి దాన్యం కొనుగోళ్ల కేంద్రాలను సందర్శించాలి.

కటింగ్ పేరిట మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారి పైన చర్యలు తీసుకోవాలి

జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యలయంలో జిల్లా కలెక్టర్,అడిషనల్ కలెక్టర్ మరియు జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోల్లు సాఫీగా జారిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని,కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని,అధికారులు కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళి దాన్యం కొనుగోళ్ల కేంద్రాలను సందర్శించాలని,గన్నిబ్యాగ్స్ కొరత లేకుండా చూడాలని,ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా లారీల కొరత లేకుండా చూడాలని,ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం కొనుగోలు కొనసాగాలని,కటింగ్ పేరిట మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page