చెన్నై, కాంచీపురం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన
చెన్నై:డిసెంబర్ 12
ఆలయాల సందర్శనల్లో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వస్తున్నట్లు చెన్నై నగర తెదేపా అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు.
అక్కడి శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారని అన్నారు. మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్ బేగంపేట నుంచి విమానంలో బయలు దేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూరు ఆల యాన్ని చేరుకుంటారని తెలిపారు.
దర్శనం తర్వాత సాయం త్రం చెన్నై చేరుకుని రాత్రి 8.50కు విమానంలో విజయవాడ బయలు దేరనున్నట్లు వివరిం చారు.
తెదేపా అధినేత నారా చంద్ర బాబునా యుడు మంగళ వారం కాంచీపురం జిల్లా శ్రీపెరుం బుదూరుకు వస్తున్నట్లు చెన్నై నగర తెదేపా అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు..