తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *కులగణన* కార్యక్రమాన్ని అభినందిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులతో పాటు కుల సంఘాల మేధావులతో బోయిన్ పల్లిలోని *గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో* ఏర్పాటు చేసిన కార్యక్రమానికి * రాహుల్ గాంధీ * రేపు సాయంత్రం 4.00 గంటలకు నగరానికి విచ్చేస్తున్నారు. వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గౌరవ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు సెక్రెటరియేట్ లోని వారి చాంబర్ లో జిల్లా ఎంపీ , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో సమిక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుండడం అభినందనీయం అన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా హైకోర్టు సూచనల మేరకు డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. రాహుల్ గాంధీ కి స్వాగతం పలికేందుకు ఎల్బీనగర్ నుంచి భారీగా జన సమీకరణ చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా బీసీ కులగరణ అంశంపై డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య శ్రీధర్ బాబు పేషీకి వచ్చి అభినందనలు తెలిపారు . మహేష్ కుమార్ గౌడ్ తో పాటు, మంత్రి శ్రీధర్ బాబు ని, మధుయాష్కి గౌడ్ గార్లను సన్మానించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top