ధాన్యం రైతు గోస.. కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం..
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
తూ తూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
●24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేపట్టాలి.
లేనియెడల రైతుల పక్షాన పోరాటం చేస్తాం
బోనస్ అంటిరి.. బోగస్ మాటలేనా
●సుంకె రవిశంకర్
మాజీ శాసన సభ్యులు
చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామలలో ఫాక్స్ సెంటర్ లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని కోరారు.
గంగాధర మండలం కురిక్యాల ధాన్యం కొనుగోలు ఫాక్స్ సెంటర్ సందర్శించారు.
అనంతరం
స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలసి పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామాలలో వరి ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారని అన్నారు. మార్కెట్లలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, వరి ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి పట్టాలు లేకా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.
ధాన్యం కొనుగోలు వెను వెంటనే చెయ్యకపోవడంతో వర్షాలు పడి ధాన్యం తడిసి మోలకెత్తడంతో రైతులు ఆ ధాన్యాన్ని అమ్మడం కోసం అనేక ఇబ్బందులు పడి తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ ఎన్నికల వాగ్దానాలలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి నేడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం సరైనది కాదని దీని పూర్తిగా విరమించుకోవాలని, రైతులు పండించిన అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసే సందర్భంలో రైతులకు వివిధ రకాల కారణాలు చూపి కోత విధించకుండ చూడాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఇస్తూ క్వింటాలు ధాన్యాన్నికి ఏమాత్రం తరుగు తీసేయకుండా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏ రైస్ మిల్లుకు కూడా ధాన్యం కొనుగోలు అలాట్మెంట్ ఇవ్వలేదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారని,
రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇస్తే తప్ప కాంటాలు కావని, కాంటాలు అయిన ధాన్యం రైస్ మిల్లులకు పంపడం జరుగుతుందని పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి రైస్ మిల్లులకు అలాట్మెంట్ కేటాయించి కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించాలని ఆయన కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App