జూన్ 26, 2026

IMG 20241101 WA0021

TRINETHRAM NEWS

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ లోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రతినిత్యం వహిస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం లేకపోవడం అదేవిధంగా డిగ్రీ కాలేజ్ పక్కాభవనం ఏర్పాటుకు 2021లో సాంక్షన్ అయ్యింది కానీ ఇప్పుడు 2024 మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వికారాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం ఏర్పాటు కోసం స్థలం ఇంకా కేటాయించలేదు అదేవిధంగా వికారాబాద్ లోని బాయ్స్ హై స్కూల్ లో మూడు రూములు కేటాయించి విద్యార్థులకు తరగతి గదులు సరిపోక చెట్ల కింద కూర్చోబెట్టి పాదాలు చెబుతున్న పరిస్థితి ఈరోజు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో చోటుచేసుకుంది వీలైనంత తొందరగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం కోసం స్థలాన్ని కేటాయించి తొందరగా పనులు మొదలు పెట్టాలి లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యమాలైనా సరే చేయడానికి సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమం లో టౌన్ వైస్ ప్రెసిడెంట్ సంజు దయాకర్ టౌన్ జాయింట్ సెక్రటరీ కార్తీక్ తేజ విష్ణు వర్ధన్ శశిధర్ గౌడ్ కేశావ్ రావు రాకేష్ యాదవ్ ప్రణీత్ రామ కృష్ణ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page