ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 10 27 at 12.57.47

TRINETHRAM NEWS

ఫాంహౌస్ చుట్టూఉన్న సీసీ ఫుటేజ్‌ను వెంటనే రిలీజ్ చేయాలి : రఘునందన్ రావు

Trinethram News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫాంహౌస్ ఒనర్ తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫాంహౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను వెంటనే రిలీజ్ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

జన్వాడలో ఫాంహౌస్ పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్ లో శనివారం రాత్రి పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా రేవ్ పార్టీ నిర్వహిస్తుండటంతో పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. వీరిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో కేసు నమోదు చేశారు. విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ మావమరిది ఫామ్ హౌస్. దీంతో ఈ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీ పులేజీలను వెంటనే రిలీజ్ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page