ప్రభుత్వ డిగ్రీ కళాశాల(A), నగరి ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం
Trinethram News : Chittoor : రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మరొక ప్రపంచ యుద్ధం రాకుండా ఉండటానికి ప్రధాన కారణం ఐక్యరాజ్య సమితి అని నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా.భాస్కర రాజు తెలియజేశారు. 79వ ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం మరియు NSS సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రపంచ యుద్ధాలను నివారించడంతో పాటు అంగోలా, కంబోడియా, కాంగో, లిబియా, రువాండా, మొజాంబిక్, టాంజానియా, సూడాన్ వంటి అనేక దేశాలలో జాతుల మధ్య సంఘర్షణలను నివారించి శాంతిని నెలకొల్పడంలో, శరణార్థులను ఆదుకోవడంలో రాజకీయతర రంగాలలో ఐక్యరాజ్య సమితి చేసిన కృషి అనిర్వచనీయమైనదని తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నగరి సర్కిల్ ఇన్స్పెక్టర్ మోపూరి మహేశ్వర గారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రజల మానవ హక్కులను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నదని తెలిపారు. లింగ సమానత్వం అనేది కేవలం నినాదంగా మిగిలిపోకూడదని, నిత్య జీవితంలో భర్తగా, సోదరుడిగా, కుమారుడిగా ఇలా వివిధ పాత్రలలో పాటించి చూపాలని సూచించారు. స్త్రీ, పురుష హక్కులే కాకుండా, ట్రాన్సజెండర్స్ యొక్క హక్కులను కూడా గౌరవించాలని కోరారు. ఐక్యరాజ్య సమితి 2024 నినాదం అయిన “మానవ హక్కులు, లింగ సమానత్వం, మరియు సామాజిక న్యాయం” సాధనకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులు మొబైల్ ఫోన్లను అప్రమత్తగా వినియోగించాలని, లేదంటే భవిష్యత్ నాశనం అవుతుందని సూచించారు. ప్రభుత్వ చట్టాలను అనుసరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు, అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.
ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా కళాశాల నిర్వహించిన వ్యాస రచన మరియు క్విజ్ పోటీలలో విజేతలైన వెన్నెల, మోహన్, నేతాజీ, భానుప్రియ, చారులత మరియు జెనీష్ కుమార్ లకు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల IQAC కోఆర్డినేటర్ డా. ఇందిరా ప్రియదర్శిని, NCC లెఫ్టినెంట్ డా.భాస్కర్, డి.ఆర్.సి మరియు సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ డా. అరుణ కుమారి, జె.కె.సి. కోఆర్డినేటర్ డా. పంకజ, కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతి డా.శ్రీలక్ష్మి, భౌతిశాస్త్ర విభాగాధిపతి డా. సుహాసిని, ఆంగ్ల విభాగాధిపతి డా. రేవతి, కుమారి, భాషా, శివకుమార్, జోతి ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App