TRINETHRAM NEWS

ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*సన్న, దొడ్డు రకాల ధాన్యానికి వేరు వేరు కౌంటర్, కాంటాలు ఏర్పాటు

*ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలో రైతులకు చెల్లింపులు

ధాన్యం కొనుగోలు ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

పెద్దపెల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించిన ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 కు సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు పై అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తొ కలసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు సంబంధించి జిల్లాలో పటిష్ట కార్యాచరణతో 300కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. గతానికి భిన్నంగా ఈ సీజన్ నుంచి సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కౌంటర్లు, కాంటాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు.

ధాన్యం కొనుగోలుకు అవసరమైన మేర గోనె సంచులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచి పోకుండా టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులలో ప్రచారం కల్పించాలని, అదే విధంగా సన్న రకం దాన్యం గుర్తింపు పక్కాగా జరిగేలా చూడాలని అన్నారు.

బస్తాలలో నింపిన ధాన్యాన్ని ఎప్పటి కప్పుడు మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో ప్యాడ్ క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని , టెంట్, త్రాగు నీరు, కుర్చీలు మొదలగు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. తాళ్ళు, తరుగు ఆంశంలో అవకతవకలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని అన్నారు.

ప్రతి కొనుగోలు కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలలో సాగు చేసిన ధాన్యం వివరాలు వ్యవసాయ శాఖ నుంచి తీసుకొని దానికి తగిన విధంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డి.సీ.ఓ. శ్రీమాల , డి.ఆర్.డి.ఓ.రవీందర్, డి.ఎం.శ్రీకాంత్, డి.ఎం.ఓ.ప్రవీణ్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App