WhatsApp Image 2024 10 22 at 13.31.48
యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
Trinethram News : Hyderabad : అక్టోబర్ 22
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బులంద్ షహర్‌లోని సికిందరాబాద్‌లో ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోని వారంతా ఉలిక్కిపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృత దేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.ఈ మేరకు బులంద్‌షహర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ మీడియాలో మాట్లాడారు.. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని చెప్పారు. ఆశాపురి కాలనీలోని ఒక ఇంట్లో రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినట్టుగా సమాచారం.
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇంట్లో మొత్తం 18 నుంచి19 మంది వరకు ఉన్నారని తెలిసింది. ఎనిమిది మందిని ఇక్కడ నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
వారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఐదుగురి మరణాన్ని ధృవీకరించారు. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. చికిత్స కొనసాగుతోందని చెప్పారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
