TRINETHRAM NEWS

Trinethram News : హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ప్రతి ఒకకరూ చెప్పారు. యాక్సిస్ మై ఇండియా కూడా ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పింది. బీజేపీకి పూర్తిగా అనుకూలమైన మీడియాలుగా పేరు పడిన సంస్థలు కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష గెలుపు ఖాయమన్నాయి.కానీ ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఈ ఫలితాలు చూసి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు జాలిగా చూడటం తప్ప ఏమీ చేయలేరు.

చేతిలోకి వచ్చిన విజయాన్ని నేలపాలు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వెళ్లేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకుంది. పలితంగా భారీగా సీట్లను కోల్పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌కు దాదాపుగా సమానంగా ఓట్లు వచ్చాయి. కానీ సీట్లలో మాత్రం బీజేపీకి దాదాపుగా ఇరవై వరకూ ఎక్కువ వచ్చాయి. ఈ తేడా అంతా కొన్ని ఓట్ల తేడాతోనే. ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపుగా రెండు శాతం ఓట్లు వచ్చాయి. పొత్తులు పెట్టుకుని ఉన్నట్లయితే.. లెక్కలు మారిపోయేవి.

కానీ సర్వేల్లో గెలిచిపోతామని రావడంతో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోలేదు. కానీ బీజేపీ ఎలక్షనీరింగ్ ను మాత్రం తక్కువ అంచనా వేసింది. చివరికి ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. గెలవాల్సిన మరో రాష్ట్రాన్ని నేలపాలు చేసుకుంది. తెలంగాణలో విజయం ఎలా వచ్చిందో కనీసం అధ్యయనం చేసి ఉన్నా.. హర్యానా చేయి దాటిపోయేది కాదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App