TRINETHRAM NEWS

Special powers to HYDRA.. no more collapse

హైడ్రాకు ఇక నుండి హై పవర్స్.. ఆమోదం తెలిపిన గవర్నర్

హైడ్రాకు ప్రత్యేక అధికారాలు.. ఇకపై కూల్చుడే.

జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 374బీ ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం

తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కు ఉన్న అధికారాలు.

తెలంగాణ బీపాస్ చట్టం-2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్‌కు ఉన్న అధికారాలు.

హెచ్ఎండీఏ చట్టం-2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారం.

తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు ఉన్న అధికారాలు.

తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీవో ఎం.ఎస్-67 ద్వారా 2002లో యూడీఏ/ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలు.

తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు.

వాల్టా చట్టం-2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలు.

హైడ్రా ఈ కొత్త అధికారాలతో స్వయంగా అవసరమైన చర్యలను ఆలస్యం అవ్వకుండా తీసుకోగలుగుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special powers to HYDRA.. no more collapse