AIFB Bandari Shekhar will fight on local issues based on the promises given by the Congress
చొప్పదండి : త్రినేత్రం న్యూస్
ఈరోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగినది. ఈ సమేవశంలో జాతీయ కార్యదర్శి శివ శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డీ, రాష్ట్ర కార్యదర్సి కోమటిరెడ్డి తెజీదీప్ రెడ్డీ, రాష్ట్ర కార్యదర్సిలు, ఉపాధ్యక్షులు వివిధ జిల్లా కార్యదర్శులు, ముఖ్యమైన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కౌన్సిల్ సమావేశంలో కరీంనగర్ నుండి బండారి శేఖర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై, స్థానిక సమస్యలపై కరీంనగర్ లో పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేసారు. జిల్లా స్థాయిలో జరిగిన అన్ని రకాల కార్యక్రమాలు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముక్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ చేసిన కార్యక్రమాలు , భవిష్యత్తు లో చేయబోయో కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతలపై చేసిన పోరాటాలు చెప్పాము. భూ సమస్యలపై సీజీసీనా ఉద్యమాలు, చెరువు, కుంట శిఖం లపై చేసిన పోరాటాలు అన్ని అంశాలు పార్టీ రాష్ట్ర కౌన్సిల్ లో చెప్పి చర్చ చేయడం జరిగింది.
కరీంనగర్ లో భవిష్యత్తు లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీ లపై , ప్రజలు ఎదురకొంటున్న స్థానిక సమస్యలపై ఎక్కడికి అక్కడ పోరాటాలు చేస్తామని , భూ సమస్యలపై ఉద్యమాలు చేస్తామని తెలియజేయడం జరిగింది.
బండారి శేఖర్
ప్రధాన కార్యదర్శి
ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App