WhatsApp Image 2024 09 25 at 2.32.27 PM
YouTuber Harshasai who opened her mouth on the rape case
Trinethram News : Telangana : రేప్ కేసుపై యూట్యూబర్ హర్షసాయి నోరు విప్పాడు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి అని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్ సమాధానం చెబుతారని వెల్లడించాడు. మరోవైపు పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.
హర్షసాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. హర్షసాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు.. ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ సమయంలో వీడియోలు తీసి.. కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
