TRINETHRAM NEWS

Threat Mail: ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఈ-మెయిల్‌.. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్ట్‌ల్లో హైఅలర్ట్‌

ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. జైపూర్, ఢిల్లీ, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని మెయిల్ లో రాశారు. ఈ సందేశం అందిన వెంటనే భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. CISF బృందం వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు.

దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని బెదిరింపు ఈమెయిల్‌ రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ,ముంబై , చెన్నై , అహ్మదాబాద్‌ , లక్నో , చండీఘడ్‌, జైపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఈమెయిల్‌ రావడంతో హైఅలర్ట్‌ ప్రకటించారు. బాంబ్‌ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్ట్‌ల్లో తనిఖీలు చేపట్టారు. అధికారిక కస్టమర్ కేర్ ఐడీకి ఇమెయిల్ రావడంతో అన్ని విమానాశ్రయంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. స్థానిక పోలీసుల సహాయంతో విమానాశ్రయంతో పాటు అక్కడ ల్యాండింగ్ చేసే విమానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు జరిపిన విచారణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈమెయిల్‌ను ఎవరు పంపారనేది ఆరా తీస్తోంది. డిసెంబర్ 27 బుధవారం రాత్రి 10:23 గంటలకు ఒక ఇ మెయిల్ వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

డిసెంబర్ 27న బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. బెదిరింపు మెయిల్‌ రావడంతో విమానాశ్రయ అధికారులు సీఐఎస్‌ఎఫ్‌ సహాయంతో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది. సెర్చ్ ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎవరు ఇచ్చారనే దానిపై విమానాశ్రయ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తోంది. గతంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు రావడం గమనార్హం.

ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. జైపూర్, ఢిల్లీ, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని మెయిల్ లో రాశారు. ఈ సందేశం అందిన వెంటనే భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. CISF బృందం వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో విచారణ చేపట్టారు అధికారులు.