TRINETHRAM NEWS

Vikarabad former MLA Dr. Metuku Anand’s house was surrounded by police and prevented from going to Gandhi Hospital

Trinethram News : బిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల భారాస కమిటీ వేసింది. వైద్యులైన సంజయ్‌, రాజయ్య, మెతుకు ఆనంద్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురిని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ను బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు
ఈ సందర్భంగా భారాస నేతలు మాట్లాడుతూ.. ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయమెందుకు అని నిలదీశారు. అక్కడి మాతా శిశు మరణాలను ప్రభుత్వం దాస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. మరోవైపు తమ నాయకుడి ఇంటి నుంచి పోలీసులు వెళ్లిపోవాలని భారాస నేతలు కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App