జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 21 at 18.03.12

TRINETHRAM NEWS

Health cards should be applied to all lawyers who come after June 2019, Ilu calls

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పెద్దపెల్లి జిల్లా కమిటీ నిర్ణయం మేరకు గోదావరిఖని AILU ఆధ్వర్యంలో, జూన్ 2019 సంవత్సరం నుండి బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకున్న న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ యిచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు అని, అందుకుగాను తెలంగాణ రాష్ట్ర లా సెక్రెటరీ గారికి పోస్టు కార్డుల ఉద్యమం ఈరోజు గోదావరిఖనిలో అధ్యక్ష కార్యదర్శులు ఆసంపల్లి రవికుమార్ రామటెంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

రాష్ట్ర ఉపాధ్యక్షలు శైలజ మాట్లాడుతూ, గోదావరిఖని లో దాదాపు 70మంది 2019 జూన్ తరువాత నమోదు అయిన న్యాయవాదులు ఉన్నారు వారికి నేటికీ హెల్త్ కార్డ్స్ రాలేదు అలాగే రాష్ట్రావ్యాపీతంగా వేలమంది న్యాయవాదులకు కార్డ్స్ లేవు కావున తక్షణమే 2019 జూన్ తరువాత వచ్చిన న్యాయవాదులందరికి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ హెల్త్ కార్డ్స్ యివ్వాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గోష్క ప్రకాష్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెందాల శైలజ మరియు ఎరుకల ప్రదీప్ కుమార్ గాదె శ్రీలత, రేష్మ సుజాత షానవాజ్ రజిత స్రవంతి నూతి సురేష్ వేణు శ్రీకాంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Health cards should be applied to all lawyers who come after June 2019, Ilu calls

You cannot copy content of this page