TRINETHRAM NEWS

150 acres for Skill Varsity, Rs. 100 crores

Trinethram News : Telangana : ఇదిలా ఉంటే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా సీఎం రేవంత్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ‘తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డు’తో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ కీలక విషయాలను తెలిపారు. ‘తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు.

ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్సిటీకి 150 ఎకరాల స్థలం, రూ. 100 కోట్లు కేటియించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. నిర్వహణకు అవసరమయ్యే కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రను నియమించిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

150 acres for Skill Varsity, Rs. 100 crores