Procession on the occasion of Milad un Nabi
మహ్మద్ ప్రవక్త సల్లెవలె వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తన్ జిమ్ అహెలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని గాంధీనగర్ లో నురాని మదర్సా నుంచి గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూ మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు
నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో జరిగిన సమావేశంలో మదీన మజీద్ మౌలాన మహ్మద్ షహదత్ హుస్సేన్ మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త ఐకమత్యం, సోదర భావం, ధర్మ మార్గంలో నడవడం, జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తన్జమ్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ హస్సేన్ చిస్తి మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని, ప్రవక్త ఒక్క ముస్లీంలకే కాదు ఆయన ప్రపంచం మొత్తానికి ఆదర్శ ప్రాయంగా నిలిచారని చెప్పారు.
అలాగే తన్జమ్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ మాట్లాడుతూ ప్రవక్త అనంత కరుణామయుడని, విశ్వశాంతి నిమిత్తం అల్లాహ్ ప్రవక్తను ఆఖరి ప్రవక్తగా ఎంపిక చేసినట్టు చెప్పారు. తబీమ్ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ నాయకత్వంలో మరియు ప్రధాన కార్యదర్శి మహ్మద్ హస్సేన్ చిస్తి ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో తన్ జిమ్ గౌరవ అధ్యక్షులు మహ్మద్ షరీఫ్, షేక్ హాజి అలీ,ఉపాధ్యక్షులు, న్యాయవాది ఉమర్, గులాం సాబ్రి, కోశాధికారి మహ్మద్ మున్వర్, సంయుక్త కార్యదర్శులు గౌస్ బేగ్, కలీం సాబ్రి, కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫిక్, నాయకులు నాజీమోద్దీన్, వివిధ మసీదు కమిటీల అధ్యక్షులు షేక్ అలీ, రియాజ్ బేగ్, సయ్యద్ జానీ, ఖాసీం, హబీబ్ బేగ్, సర్వర్ హుస్సేన్, మౌలానా బద్రోద్దీన్, మౌలానా హబీబుల్ రహమాన్, మౌలానా అక్బర్, మీర్ జాకీర్, లియాఖత్ అలీబేగ్, మొబిన్, గౌస్, అస్లాం, ఫుర్ఖాన్, అజ్మత్ బేగ్, సర్దార్, బాజీ, ఆగ్ర తాజ్, ఫయాజ్, మొయిన్, ఖాజా హుస్సేన్, ఖాజా గయాసోద్దీన్, మహ్మద్ అఫ్రిద్ చిస్తి పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.