Burning effigy of Rastaroko and Central Govt on Rajiv Road by Godavarikhani Town Congress
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిపై ఢిల్లీ బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్వీవింధర్ సింగ్ మరియు శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ పైన నాలుక కోస్తామని చంపుతామని బిజెపి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యాలను ఖండిస్తూ గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో మరియు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, హాజరై మాట్లాడుతూ భారతదేశంలో అగ్రనేత ప్రజా సమస్యలే గేయంగా పనిచేస్తూ జో డోయాత్ర ద్వారా దేశమంత పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీ,
నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అన్ని పార్టీల మన్ననలు పొందుతున్నాడు అలాంటి నాయకుని పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకునే ప్రసక్తే లేదని బిజెపి నాయకుల ఆఫీసులను ముట్టడిస్తామని అని హెచ్చరించడం జరిగింది. ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకు వెళ్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడు వలె పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలని పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యత వహిస్తూ హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి, రవికుమార్, పాత పెళ్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, దీటి బాలరాజు, బొమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాష్ కొప్పుల శంకర్, నాయిని ఓదెలు, గట్ల రమేష్, దాసరి సాంబమూర్తి, యాకూబ్, దాసరి విజయ్, బాల రాజ్ కుమార్, కౌతమ్ సతీష్, శ్రీనివాస్ రెడ్డి, ఉదయరాజ్, ఆడెపు రవి, మాలెం మధు, హనుమ సత్యనారాయణ, గుండేటి శంకర్, తిరుపతి రెడ్డి, గుమ్మడి రవి, గడ్డం శేఖర్, కంకణాల రాజు, సాయి, బొంతల లచ్చన్న, మోహిద్ సన్ని, ఉల్లంఘిల రమేష్, బాబు మియా, గడ్డం శీను, సతీష్ గౌడ, వరలక్ష్మి, శాంత కుమారి, పద్మ, అల్లి శంకర్, తిరుపతి రెడ్డి, గోవర్ధన శాస్త్రి, కుంట సది, దామక పవన్, ప్రసాద్, సుంకరి సంతోష్, గఫూర్, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App