తెలంగాణ కొత్త కాంగ్రెస్ చీఫ్ గా భట్టి – రాహుల్ ఛాయిస్…?
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధి ఎవరు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి కావటంలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు ప్రారంభమైంది.
లోక్ సభ ఎన్నికల వేళ రేవంత్ తో కలిసి పార్టీని గెలిపించే నేత పైన అన్వేషణ ప్రారంభమైంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్సీ లేదా బీసీ వర్గానికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నారు.
దీంతో పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
కొత్త పీసీసీ చీఫ్ రేసులో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ గా కొత్త పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరు పరిశీలనలో ఉందని సమాచారం.
కర్ణాటకలో డీకే శివ కుమార్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన మాదిరే తనకు కూడా ఆ పదవి ఇవ్వాలి కోరుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా సోనియా ఖర్గేతో భేటీ సమయంలో ఇదే అంశం పైన చర్చించినట్లు సమాచారం.
అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం ఇవ్వటంతో బీసీ వర్గానికి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు పార్టీ నుంచి వ్యక్తం అవుతున్నాయి.?
సామాజిక సమీకరణాలతో బీసీ వర్గం నుంచి పీసీసీ చీఫ్ కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ మహేష్ కుమార్ గౌడ్ వీ హనుమంతరావు పేర్లు పరిశీలన ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.?
మధుయాష్కీ తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
దీంతో మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా యాదవ వర్గానికి చెందిన మాజీ ఎంపీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ అభిప్రాయానికి హైకమాండ్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
సీఎం – పీసీసీ చీఫ్ కలిసి లోక్ సభ ఎన్నికల వేళ పని చేయాల్సి ఉండటంతో ఈ నిర్నయం పైన హైమాండ్ ఆచి తూచి వ్యవహరిస్తోంది.
అయితే ఎస్సీ వర్గానికి డిప్యూటీ సీఎం..స్పీకర్ పదవి ఇవ్వటంతో బీసీ వర్గానికే పీసీసీ చీఫ్ ఇస్తారని భావిస్తున్నారు.
భట్టికి ఛాన్స్ దక్కేనా త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలకు కౌంటర్ గా కాంగ్రెస్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది.
మంత్రివర్గ విస్తరణలో మరో ఆరు ఖాళీలు భర్తీ చేయాల్సి ఉండటంతో వచ్చే వారం వీటి పైనా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దీంతో.
ఇప్పుడు భట్టికి పీసీసీ చీఫ్ ఖాయమనే ప్రచారం పార్టీలో జరుగుతున్న వేళ హైకమాండ్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది…