WhatsApp Image 2024 09 13 at 17.43.30
Supreme Court ignores Article 341
ఎస్ సి వర్గీకరణ తీర్పు పై పునరాలోచించాలని జాతీయ ఎస్ సి ఎస్ టీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాగ్వనా ను మరియు జాతీయ ఎస్ సి ఎస్ టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ కలిసిన మాలమహానాడు ఆఫ్ ఇండియా బృందం
341 ఆర్టికల్ ను విస్మరించిన సుప్రీం కోర్టు
మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు
డా పసుల రాంమూర్తి
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి ఆధ్వర్యంలో ఢిల్లీ లోని ఎస్ సి ఎస్ టీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాగ్వనా ను కలిసి ఎస్ సి వర్గీకరణ పై పునరాలోచన చేయాలనీ వినతి పత్రం అందచేయడం జరిగింది జాతీయ ఎస్ సి ఎస్ టీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాగ్వనా సానుకూలంగా స్పందించారు జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి మాట్లాడుతూ 341 ఆర్టికల్ ను సుప్రీం కోర్టు విస్మరించినది అని తెలిపారు అనంతరం ఢిల్లీ లోని జాతీయ ఎస్ సి ఎస్ టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ ను కలిసి ఎస్ సి వర్గీకరణ పై పునరాలోచన చేయాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది జాతీయ కమిషన్ మెంబర్ సానుకూలంగా స్పందించారు వినతి పత్రం ఇచ్చిన వారు మాలమహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపక సుధీర్ జాతీయ యువజన ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షులు అరె దేవకర్ణ రాష్ట్ర మహిళ కార్యదర్శి గంట బబిత తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Supreme Court : 341 ఆర్టికల్ ను విస్మరించిన సుప్రీం కోర్టు”
Comments are closed.