WhatsApp Image 2024 09 12 at 17.00.33
Kaushik Reddy should be given full security: Harish Rao
Trinethram News : హైదరాబాద్ : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిందని, ఈ ఘటనను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఇదేం ప్రజాస్వామ్యం.. ఇదేం ప్రజాపాలన.. ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు.
“మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుని 66 మాపైనే దాడి చేయించడం దుర్మార్గం. భారాస ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం హేయమైన చర్య. కాంగ్రెస్ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. సీఎం వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలి. దాడిని నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ విఫలమైంది. కౌశిక్ రెడ్డి కి పూర్తి భద్రత కల్పించాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
