International Literacy Day
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేసిన పల్లికొండ రాజేష్
చదువుకునే నిరుపేద విద్యార్థుల సౌకర్యార్థం భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమా సేవలు అమూల్యమైనవి- ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హౌసింగ్ బోర్డ్ కాలనీ రామగుండం సోమవారం రోజున అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిషరీస్ చైర్మన్
పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమా సహకారంతో పదవ తరగతి నిరుపేద విద్యార్థులకు ఎగ్జామ్ పరీక్ష ఫ్యాడ్స్ పలువురు పుర ప్రముఖుల మధ్య అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ. ముందుగా అందరికీ అంతర అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని, తెలంగాణ రాష్ట్రంలో 100% అక్షరాశ్యత ఏర్పడాలని ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి రాజ్యాంగం మనకు హక్కు కల్పించినదని భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నసీమా మేడం గత కొంతకాలంగా చదువుకునే నిరుపేద విద్యార్థులకు ఎనలేని సేవలు చేస్తున్నారని విద్యార్థుల మౌలిక సదుపాయాల సౌకర్యార్థం వారి సేవలు అమూల్యమైనవని వారి సేవలు మరింత పరిదికి విస్తృతించాలని వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎండీ.రబ్బాని, ప్రేమ్ కుమార్, గున్నాల శ్రీనివాస్,బింగి నరేందర్, బింగి రవి, పల్లికొండ నర్సింగ్, పల్లికొండ రాజేందర్, జమీర్ భాయ్,ఉమర్ తదితరులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App