Raped : కన్నతల్లిని అత్యాచారం చేసిన కొడుకు.. మద్యం మత్తులో దారుణం

TRINETHRAM NEWS

The son who raped his mother in law was intoxicated

Trinethram News : Sep 5, 2024

కన్నతల్లి అంటే దేవత కంటే ఎక్కువ. 9 నెలలు కడుపులో మోసి.. ఆ తర్వాత పురిటినొప్పులు అనుభవించి ఈ లోకంలోకి ఓ బిడ్డను తీసుకువస్తుంది. ఆ తర్వాత లాలించి, ఆడించి, పాడించి పెంచి పెద్దవారిని చేస్తుంది. అలాంటి తల్లికి జీవితాంతం ఎంత చేసినా రుణం తీర్చుకోలేం. ఇక తల్లి కోసం గుడి కట్టిన వారిని.. తల్లి పేరు మీద విరాళాలు, ట్రస్ట్‌లు ఏర్పాటు చేయడం.. ఇలా చాలా మంది చాలా రకాల మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఈ దుర్మార్గుడు మాత్రం కన్న తల్లిపైనే అత్యాచారం చేశాడు. వినడానికే జుగుప్సాకరంగా ఉన్న ఈ సంఘటన వెలుగులోకి రావడంతో.. అది విన్న ప్రతీ ఒక్కరు ఆ నిందితుడికి కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ దారుణమైన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కన్న తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బుండి జిల్లాలో గత శుక్రవారం రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 52 ఏళ్ల మహిళ.. 28 ఏళ్ల తన పెద్ద కుమారుడితో కలిసి.. తన సోదరుడి గ్రామానికి వెళ్లింది. ఆ తర్వాత వారిద్దరూ తిరిగి తమ గ్రామానికి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. అప్పటికే ఫూటుగా మద్యం సేవించిన ఆ కుమారుడు.. రోడ్డుపై ఎవరూ లేరని గమనించి.. తన తల్లిని రోడ్డు పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అనంతరం అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాలా లేదా అని తటపటాయించింది. ఆ తర్వాత తన చిన్న కుమారుడు.. కుమార్తెతో కలిసి డాబి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన పెద్ద కుమారుడిపై ఫిర్యాదు చేసింది. తన కుమారుడే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె బోరున విలపించింది. అది విని పోలీసులు షాక్ అయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఇక విచారణలో నిందుతుడు తన తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు రిమాండ్‌ విధించగా.. అతడ్ని జైలుకు తరలించినట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The son who raped his mother-in-law

You cannot copy content of this page

Scroll to Top