beware of plasma leakage in dengue
Trinethram News : హైదరాబాద్ : డెంగీ సోకితే ప్లేట్‌లెట్లు తగ్గడం కంటే.. ప్లాస్మా లీకేజీ ఎక్కువ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లో ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు.
ప్లాస్మా లీకేజీలు ఎలా గుర్తించాలంటే..
డెంగీ వైరస్‌తో రక్త నాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్షిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం. కాళ్లు, కంటిచుట్టూ వాపు, రక్తంలో హెమటోక్రిట్ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి తదితర లక్షణాలు కన్పిస్తే.. ప్లాస్మా లీకేజీగా భావించి అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. ఆలస్యం చేయడం వల్ల హెమరేజిక్ షాక్ సిండ్రోమ్‌కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
నిర్లక్ష్యం పనికి రాదు -డాక్టర్ రాజారావు, సీనియర్ వైద్యులు
డెంగీ సోకితే భయపడాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం కూడా పనికి రాదు. డెంగీకి ఎలాంటి మందులు లేవు. జ్వరం వస్తే పారాసిటమాల్‌పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పది శాతం మందిలో కొంత ప్లాస్మాలీకేజీల ముప్పు ఉంటుంది. ప్లాస్మా లీకేజీ లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App