TRINETHRAM NEWS

CM in MLA camp office. Ramagundam MLA Raj Thakur who sent RF cheques

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామి

రామగుండం మరియు అంతర్గాం మండలం పాలకుర్తి మండలం సంబంధించిన అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సహాయం కింద సి.ఏం సహాయక నిధి చెక్కులను రూ 61, 70000(అరవై ఒక్క లక్ష డెబ్బై వెలు) విలువ గల సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు రామగుండం 108 లబ్ధిదారులు , పాలకుర్తి మండలం 32 లబ్ధిదారులు, అంతర్గాం మండలం 30 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం మండలం మరియు అంతర్గం పాలకుర్తి మండలం చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులను సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి రామగుండం రూ.45,00000 ) నలభై అయిదు లక్షలు పాలకుర్తి మండలం (8,76000 ఎనిమిది లక్షల డెబ్బై ఆరువేల మరియు అంతర్గాం మండలం (802000)ఎనిమిది లక్షల రెండు వేలు)(విలువ గల సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉండే దిశలో వెళ్తున్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వంరామగుండం నియోజకవర్గం జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవారికి అందులో చూడాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాం ఎవరు కూడా అధైర్య పడదు ధైర్యంగా ఉండండి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

అని అలాగే గత బి.అర్.ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫి పెద్ద బోగస్ అని విమర్శించారు పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అన్నారు రానివల్ల కూడా వస్తువులలో అందుతుంది అన్నారు 2014 సంవత్సరంలో ఏర్పాటైన బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని,టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో,రైతులు పండించిన వడ్లను రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్ల రూపంలో రైతుల రక్తాన్ని తాగారని అన్నారు. దేశంలో ఉన్న బిజెపి పార్టీ కూడా ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని, అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని అన్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు..

త్వరలోనే నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM in MLA camp office. Ramagundam MLA Raj Thakur who sent RF cheques