WhatsApp Image 2024 08 21 at 18.32.42
Farmers should be given loan waiver without any conditions
రాష్ట్రంలోని రైతులను నట్టేటా ముంచుతున్నా కాంగ్రెస్ పార్టీ
రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
రైతులకు 2 లక్షల రుణమాఫి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా వారిని నట్టేటా ముంచిందని రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
బుధవారం గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో గునపాలు దింపిందని అన్నారు. ఓడ దాటే వరకు ఓడ మల్లన్న ఓడ దాటినా తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సందర్భం వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాలలో రేపు ధర్నాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూన్నామని పేర్కొన్నారు. రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రజలు నాయకత్వాన్ని నిలదీయాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.
ఈ విలేఖరుల సమావేశం లో మాజీ జడ్పీటిసీ ఆముల నారాయణ కార్పోరేటర్ కల్వచర్ల కృష్ణ వేణీ గాధం విజయ నాయకులు నారాయణదాసు మారుతి అచ్చే వేణు చల్లగురుగుల మెగిళి బోడ్డుపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి తోకల రమేష్ కర్రి ఓదేలు సట్టు శ్రీనివాస్ కిరణ్ జీ గుంపుల లక్ష్మి రమాదేవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
