IMG 20240815 WA0029
Dr. A. Chandrasekhar, former minister, unveiled the national flag
Trinethram News వికారాబాద్/ఎసిఆర్ భృంగి విద్యాసంస్థలు: 78 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎసిఆర్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బృంగి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. ప్రమీల చంద్రశేఖర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మన దేశం స్వేచ్ఛ స్వతంత్రాల కోసం జీవితాలు ,ప్రాణాలు దార పోసిన మహానుభావులందరినీ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
వారి త్యాగాల పునాదులపై దేశ నిర్మాణం సాగిందని అన్నారు. విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదిగి దేశ అభివృద్ధి కోసం పరితపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు ,చిన్నారులు స్వతంత్ర సమరయోధుల వేషాధారణలో పాల్గొని కనువిందు చేసారు. ఈ కార్యక్రమంలోఎసిఆర్ బృంగి విద్యాసంస్థల కార్యదర్శి ఎ.ప్రమీలచంద్రశేఖర్, ప్రిన్సిపల్ లు రమాదేవి , ఆల్బర్ట్, డైరెక్టర్లు కుమారస్వామి, కాళాశాల డైరెక్టర్ శివప్రసాద్. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
