A huge rally with national flags under the leadership of BJP Ramagundam in-charge Kandula Sandhyarani
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు “హర్ గర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా బిజెపి రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ వద్ద నుండి రాజేష్ టాకీస్ ప్రధాన చౌరస్తా వరకు జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై వందేమాతరం అను నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు జాతీయ జెండాను పంపిణీ చేసి ప్రతి ఇంటి ఇంటికి జాతీయ జెండాను పెట్టాలని వారిని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ
స్వాతంత్ర్యానికి జరిపిన ప్రయాణం చాలా సుదీర్ఘమైనది మరియు కఠినమైనది, ఒక స్వతంత్ర భారతాన్ని కలగన్న ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పట్టుదలతో ఒక్క తాటి మీదకి వచ్చి మహాత్మ గాంధీ యొక్క హింసారహిత నిరసన నుండి భగత్ సింగ్ యొక్క నిప్పు కనికలు చిందే తిరుగుబాటు వరకు, ప్రతి ఒక్కరు దేశ కాంక్ష స్ఫూర్తికి తోడ్పడారు. ఆణిచివేతను ఎదిరించిన వారి కథలు, దశాబ్దాల తరువాత కూడా, మన కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తాయి. భావితరాలు స్వేచ్ఛ గాలి పీల్చేందుకు, ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్న యువకులు, యువతుల జ్ఞాపకాలు మనల్ని ఉద్వేగభరితులుగా మారుస్తాయి.
స్వాతంత్ర్య దినోత్సవం కృతజ్ఞతా భావాన్ని కూడా మేల్కొలుపుతుంది. మన స్వేచ్ఛను పొందేందుకు తమ ప్రాణాలను అర్పించిన వారికి మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. వారి ప్రయాసల ఫలితాలు చూడకుండా, తమ అందరిదీ ప్రాముఖ్యం తక్కువ కాకపోయినా, చరిత్ర పుస్తకాలలో వారి పేర్లు లేకపోవచ్చు. వారి త్యాగాలు, వారికీ సరైన గౌరవం ఇవ్వాలని, భారతదేశాన్ని మెరుగుపరచడంలో మన బాధ్యతను గుర్తు చేస్తాయి.
స్వాతంత్ర్య దినోత్సవం అంటే, కేవలం గతాన్ని స్మరించడం మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించడం. మనం స్వేచ్ఛలో బతకడానికి ఇచ్చిన స్వతంత్ర స్వేచ్చను మన తర్వాతి తరాలకు సంరక్షించేందుకు, సంరక్షించే బాధ్యత గురించి గుర్తుచేసే భావోద్వేగపూరిత అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హన్మంతు గౌడ్, చెన్నూరి అసెంబ్లీ ప్రబారి క్యాతం వెంకటరమణ,కోమల మహేష్,అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ మరియు మండల అధ్యక్షులు కొడూరి రమేష్,జనగామ భూమయ్య,గోపగాని నవీన్ గౌడ్,మిట్టపల్లి సతీష్,బానాల స్వామి,మామిడాల శ్రీనివాస్ నాయకులు మచ్చ విశ్వాస్, తడగొండ నరసయ్య, పిడుగు క్రిష్ణ,,పంగ రవి, మామిడి వీరేశం,కోమ్మ స్వామి,మేరుగు శ్రీనివాస్,అందె రాజ్ కుమార్, ఐత పవన్,ఈదునూరి చిరంజీవి,సిలివేరు అంజి,పల్లికొండ నర్సింగ్,పూర్ణచందర్,జక్కుల ప్రవీణ్,ఆకాశ్ గౌడ్, బియ్యాల మహేందర్,బొడ్డుపల్లి రంజిత్,బుంగ మహేష్,దాసరి ఉషాల్, నాగేంద్రబాబు,గంగరాజు,శ్రీను,శంకర్,మొగిలి,పద్మ , అపర్ణ,సంపూర్ణ తదితరులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App