BC Gurukul School : రంగంపల్లి లోని బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

District Collector inspected the BC Gurukul School in Rangampalli

గురుకుల పరిసరాలను పరిశుభ్రం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*రంగంపల్లి లోని బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ఆగస్టు-12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గురుకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ హర్ష పెద్దపల్లి మండలం రంగంపల్లి లోని మహాత్మ జ్యోతి బాపూలే బాలికల గురుకులం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రంగంపల్లి లోని బీసీ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, హాస్టల్ లో అందించే భోజనం నాణ్యత పెంచాలని , విద్యార్థులకు రుచికరంగా వంటలు చేయించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

వాన కాలం నేపథ్యంలో దోమల సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా కన్వీనర్, గురుకుల ప్రీన్సిపాల్ మని దీప్తి , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector inspected the BC Gurukul School in Rangampalli

You cannot copy content of this page

Scroll to Top