TRINETHRAM NEWS

Measures should be taken to prevent drinking water contamination

త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

Trinethram News : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు ఇందిరానగర్ లో యుజిడి సమస్యతో త్రాగునీరు కలుషితం అవుతుందని స్థానిక కౌన్సిలర్ బొండాల సువర్ణ, చైర్ పర్సన్ మంజుల రమేష్ దృష్టికి తీసుకురావడంతో ఈరోజు చైర్ పర్సన్ ఇంద్రానగర్ లో పర్యటించి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలో యుజిడి లీకేజీలు, త్రాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చైర్ పర్సన్ మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇట్టి సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ కుమార్, మెప్మా వెంకటేష్, నాయకులు బోండాల శ్రీనివాస్, రంగరాజ్, వసంత్, మున్సిపల్ సిబ్బంది నాగేందర్, యాదయ్య, జవాన్ రాజు, రాఘవేందర్, ఆర్పి స్వరూప తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Measures should be taken to prevent drinking water contamination