Investigate the robbery at Nasanakota Muthyalamma temple
ప్రకాష్ రెడ్డి అతని బ్యాచ్ కోట్ల రూపాయల సొమ్ము మింగేశారు
ఐదేళ్ల పాటు ఆదాయం, ఆభరణాలకు లెక్కలు ఎక్కడున్నాయి
నసనకోట పంచాయతీ వాసుల ఆగ్రహం
విచారణ చేయించాలని ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి
అనంతపురం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో గత ఐదేళ్లలో జరిగిన దోపిడీపై విచారణ చేయించాలని నసనకోట పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వారు వెంకటాపురంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి వినతి పత్రం అందజేశారు.
గత ఐదేళ్లుగా అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి వివరించారు. 2019కి ముందు ఇక్కడ ఆలయ కమిటీ ఉండేదని.. ఆలయానికి వచ్చిన ఆదాయంతో భక్తుల సౌకర్యం కోసం భవనాల నిర్మాణంతో పాటు ఎన్నో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అలాగే పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించామన్నారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆలయాన్ని దేవాదాయ కమిటీ పరిధిలోకి తీసుకెళ్లారన్నారు.
అక్కడ తమకు అనుకూలంగా ఉన్న కురుబ ముత్యాలును చైర్మన్ గా చేసుకొని.. ఈఓ నర్సయ్యను అక్కడ నియమించుకున్నారన్నారు. పూజార్లుగా పెద్ద పూజారి ముత్యాలప్ప, ఎద్దులప్పయ్య, లక్ష్మినారాయణ, పరంధామ మరియు వారి కుమారులంతా చేరి ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారన్నారు. భక్తులు ప్రతి నిత్యం అందించే డబ్బులు, వెండి, బంగారం ఆభరణాలను ఎవరికి వారు దోచుకున్నారని ఆరోపించారు. చివరి రెండు నెలల కాలంలో బీసీ ముత్యాలప్ప కండువా ముత్యాలు ఛైర్మెన్ గా ఉండి లక్షలలో దోపిడీకి పాల్పడ్డారని,
ఈ ఐదేళ్లలో కనీస అభివృద్ధి చేయకుండా.. ఇన్ని రోజులు వచ్చిన సొమ్ముకు లెక్క చెప్పకుండా ఉన్నారన్నారు. ఇది సుమారు 5కోట్లకు పైగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వీటిపై సమగ్రమైన విచారణ చేయించి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఛైర్మన్లుగా ఉన్న కే.ముత్యాలు, బీసీ ముత్యాలు కండువా ముత్యాలు, ఈఓ నర్సయ్యతో పాటు అక్కడ పూజారులు వారి కుమారులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మొత్తం అన్ని అంశాలు విన్న తర్వాత కచ్చితంగా దీనిని దేవాదాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. త్వరలోనే విచారణ కూడా చేయిస్తానన్నారు. అమ్మవారి సొమ్ము ఎవరు తిన్నా దానిని కక్కిస్తామని ఆమె స్పష్టం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App