ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు
హైదరాబాద్: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్ గా తేలింది.
ఉపిరితిత్తుల సంబంధిత వ్యాధితో వ్యక్తి ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో మరణించాడు.. మృతుడికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణలోనూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 54 పాజిటివ్ చేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్ట్‌లు పెంచారు…