TRINETHRAM NEWS

క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు పొంగులేటి, తుమ్మల

ఖమ్మం : నగరంలోని చర్చికాంపౌండ్ లోని సీఎస్ఐ చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని
ప్రత్యేక ప్రార్థన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్, బిషప్ లు ఈ సందర్భంగా ఇద్దరి మంత్రులకు ఆశీర్వచనలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులకు ప్రత్యేకంగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు చల్లని చూపు తెలంగాణ ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మీద ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.