Interest free loans for SC and ST Dwakra women in Andhra Pradesh
Trinethram News : అమరావతి జూలై 16
ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
కనిష్టంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపం లో తిరిగి చెల్లిస్తారు. 2024- 25 ఏడాదికి సంబంధించి రూ. 250కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ ఫైల్ పై ఎమ్ ఎస్ఎమ్ఈ , సెర్ప్, ఎన్ ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణం మంజూ రుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘా ల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో గ్రామసంఘం స్థాయి నుంచి అన్ని దశ ల్లోనూ పర్యవేక్షణ ఉంటుం ది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపా ధికి అనుగుణంగా రుణం మంజూరుచేయనున్నారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App