Rotu waiter thief arrested
సుల్తానాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సుల్తానాబాద్, వ్యవసాయ పనులకు వినియోగించే రోటు వెయిటర్ ను దొంగలించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు మాజీ దొంగ. పోలీసుల కథనం ప్రకారం శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు.
ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జంగా తిరుపతి రెడ్డి పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని అలాగే కొలనూరు లో 10 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవిస్తున్నాడని నిత్యం వ్యవసాయ పనులకు సుల్తానాబాద్ లో నివసిస్తూ తిరుపతిరెడ్డి రాకపోకలు సాగిస్తుండగా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో తొగరి అశోక్ వ్యవసాయ భూమి వద్ద శక్తిమాన్ కంపెనీకి చెందిన లక్ష పదివేల రూపాయల రోట్ వెయిటర్ కనిపించడంతో దొంగ లించాలనే ఆలోచన రాగ కొత్తపల్లిలో ఉన్న తన ట్రాక్టర్ ను సుద్దాల గ్రామానికి తీసుకువచ్చి అశోక్ వ్యవసాయ పొలంలో ఉన్న రోటు వెయిటర్ ను ట్రాక్టర్కు తగిలించుకొని వెళ్లాడని సీఐ వివరించారు శనివారం పోలీసులు మండల కేంద్రంలోని వడ్డెరకాల అని సమీపాన వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాక్టర్ కు రోటు వెయిటర్ తగిలించుకొని వెళుతున్న తిరుపతిరెడ్డి అనుమాన స్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించి కేసు నమోదు చేసుకొని చోరీకి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
తిరుపతి రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు కృషిచేసిన ఎస్సైలు శ్రవణ్ కుమార్ నరేష్ ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్ రమేష్ లను ఎస్సై అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App