Strict measures for control of seasonal diseases
ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి.రవీందర్ నాయక్
పెద్దపల్లి, జూలై -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి.రవీందర్ నాయక్ అన్నారు.
శనివారం ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి.రవీందర్ నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి.రవీందర్ నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లాలోని లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, వైద్యఅధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేయాలని, ఒక సమగ్ర కార్యాచరణ రూపొందించి, దాని ప్రకారం చర్యలు చేపట్టాలని, అన్ని రకాల మందులు ఆరోగ్య కేంద్రాలలో నిల్వ ఉంచుకోవాలని, ఎమర్జెన్సీ లో సేవలు అందించుటకు రాపిడ్ రెస్పాన్స్ టీం లను జిల్లా, మండలాల వారీగా ఏర్పాటు చేయాలని అన్నారు. హై రిస్క్ ఏరియాలను గుర్తించి ప్రత్యేకంగా సీజనల్ డిసీజ్ నివారణకు ప్రత్యేక చర్యలు ఇతర శాఖల సమన్వయంతో చేపట్టాలని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ జిల్లాలో సమన్వయ సమావేశంలో ఆదేశించిన ప్రకారం జిల్లా అదికారులు, వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని అదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ , జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకాంత్, ప్రోగ్రాం అదికారులు, వైద్య అదికారులు, మునిసిపల్ కమిషనర్ లు, మండల పరిషత్ అధికారులు , స్పెషల్ ఆఫీసర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App