TRINETHRAM NEWS

Today, educational institutions across the country are closed

ఏపీ-తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు..

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా బంద్‌..

బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి- యువజన సంఘాలు..

Trinethram News : నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలల బంద్‌ చేయాలని కోరుతూ.. ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, పీడీఎస్‌వో, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈనేపథ్యంలో ఏపీ, తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు నిచ్చారు. ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్‌లో ప్రధాని మోడీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి.

నీట్, నెట్ మాత్రమే కాదు.. గత కొన్నేళ్లుగా అన్ని పరీక్షల పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యాశాఖపై మండిపడుతున్నాయి. పరీక్షలు వారి జీవితాలకు సంబంధించినవని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూలై 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించగా.. ఆ రోజు తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే ఈ నెలలో మరో సెలవు కూడా రాబోతోంది. జులై 27న పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి.

ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం బోనాలు పండుగను పురస్కరించుకుని సెలవు ప్రకటించింది. తెలంగాణలోని ప్రధాన పండుగల్లో బోనాలు ఒకటి. 7 జూలై 2024న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించి బోనాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో జూలై 27వ తేదీని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. ఆ రోజు శనివారం, మరుసటి రోజు జూలై 28 ఆదివారం కావడంతో రెండు రోజుల సెలువు రాబోతోందని ప్రభుత్వం ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today, educational institutions across the country are closed