జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 28 at 20.42.19

TRINETHRAM NEWS

Gas compressor explosion in glass industry

ఆరుగురు దుర్మరణం..

Trinethram News : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్‌ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కంప్రెషర్ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చిద్రమయ్యాయి. పేలుడుతో పరిశ్రమలో భీతావహవాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మృతులను బిహార్‌, యూపీ, ఒడిశా వాసులుగా గుర్తించారు. పేలుడు ధాటికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడే కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన సూచనల్ని ఏ మేరకు పాటించారనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
స్పందించిన ముఖ్యమంత్రి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gas compressor explosion in glass industry

You cannot copy content of this page