Special efforts for urban development
వార్డుల్లో మౌళిక వసతులు మెరుగుపరుస్తా
సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి
పెద్దపల్లి పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.
పెద్దపల్లి పట్టణం 6,7 వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే విజయ రమణారావు మున్సిపల్, ప్రభుత్వ అధికారులు, స్ధానిక నాయకులతో కలిసి పర్యటించారు.
పెద్దపల్లి పట్టణంలో త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వానాకాలం మొదలు కావడంతో పట్టణంలో డ్రైనేజీ, త్రాగు నీటి సమస్యలపై అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 7వ వార్డు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యను వార్డు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికీ తీసుకువెళ్ళారు.
వార్డులో ఉన్న సమస్యలను తొందరలోనే పరిష్కరించాలని స్ధానిక మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. రానున్న వారం, పదిహేను రోజుల్లో పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్, ఏఈ, విద్యుత్ అధికారులు కలిసి కట్టుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.
దాదాపు రూ. 30 కోట్ల పైచిలుకు నిధులు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణల కోసం జూన్ నుండి జులై మొదటి వారంలో టెండర్లను పిలిచి ఆగస్టు మొదటి వారంలోనే పనులు మొదలు చేసేలా కృషి చేస్తామని అన్నారు. అమృత్ పథకంలో రూ. 22 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చేసి, త్రాగు నీటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు.
పెద్దపల్లి పట్టణంలో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, స్ధానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకువచ్చినా తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. గత పాలకుల చేతిలో పెద్దపల్లి పట్టణం అతలాకుతలం అయ్యిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎఈ, ప్రభుత్వ అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డుల ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App