We implemented Rythu Bandhu for the first time in the country: KTR
Trinethram News : Jun 25, 2024,
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని మాజీ మత్రి కేటీఆర్ అన్నారు. ‘దేశంలోనే తొలిసారి కేసీఆర్ హయాంలో రైతుబంధు అమలు చేశాం. 70 లక్షల మంది రైతులకు రూ. 73వేల కోట్ల రూపాయలను ఖాతాల్లో వేశాం. రైతుబీమా పేరుతో రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించాం. రూ. 25వేల కోట్లతో రుణమాఫీ అమలు చేశాం. 24 గంటల ఉచిత విద్యుత్ అందించాం. వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టాం. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించాం’ అని X వేదికగా పోస్ట్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App