జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 23 at 8.30.27 PM

TRINETHRAM NEWS

Request to MLA to allocate Singareni quarter to Ramagundam Press Club

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యులు పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్, దుర్గం నగేష్, పోతుల జాన్ ల ఆధ్వర్యంలో రామగుండం ప్రెస్ క్లబ్ కి సింగరేణి క్వార్టర్ కేటాయించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ప్రెస్ క్లబ్ ను రెండు సంవత్సరాలుగా అద్దె కార్యాలయంలో క్లబ్బు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, గతంలో లాగా జర్నలిస్టులకు యజమాన్యాలు నెలసరి జీతం చెల్లించడం లేదు కాబట్టి అద్దె కార్యాలయంలో ఉండాలంటే నానా ఇబ్బందులు పాడుతూ అద్దె చెల్లించలేకపోతున్నామని, తమరు ప్రత్యేక చొరవ చాలించి రామగుండం ప్రెస్ క్లబ్ కు సింగరేణి క్వార్టర్ కేటాయించాలని సింగరేణి జిఎం కి సిఫార్సు చేయాలని కోరారు .దీంతో సానుకూలంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే రామగుండం ప్రెస్ క్లబ్ కి క్వార్టర్ కేటాయించాలని సింగరేణి జిఎం కి సిఫారసు చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Request to MLA to allocate Singareni quarter to Ramagundam Press Club

You cannot copy content of this page