జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 21 at 12.55.13

TRINETHRAM NEWS

Srinivas Reddy joined the Congress party in the presence of CM Revanth Reddy

Trinethram News : హైదరాబాద్:జూన్ 21
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ కండువా కప్పు కున్నారు.శుక్రవారం పోచారం శ్రీనివా స్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. రైతు ల సంక్షేమానికి పోచారం ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ మారారు.రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీ యంగా తానేమీ ఆశించట్లే దని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గత ఆరు నెలలు గా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడు తోందని అన్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురవు తున్నా అన్నదాతను ఆదుకునే విషయంలో వెనుకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీ య ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైందని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రగతి, రైతుల ప్రగతి కోసం పనిచే స్తానని వివరించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Srinivas Reddy joined the Congress party in the presence of CM Revanth Reddy

You cannot copy content of this page