జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 20 at 17.49.08

TRINETHRAM NEWS

District Collector Koya Harsha made a surprise inspection of the government offices

పెద్దపల్లి, జూన్ -20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ హర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కార్యాలయాల తనిఖీ సమయంలో జిల్లా కలెక్టర్ ఉద్యోగుల విధులకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ ఇన్ వార్డు, ఔట్ వార్డు పరిశీలించి, రిజిస్టర్ లను తనిఖీ చేశారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ కు వచ్చే ప్రతి దరఖాస్తుకు సంబంధించి పక్కాగా రికార్డు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబందాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Harsha made a surprise inspection of the government offices

You cannot copy content of this page