జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 17 at 17.48.20

TRINETHRAM NEWS

Leader Pawan Kalyan took charge as Deputy Chief Minister

Trinethram News : ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు. సెక్రటేరియట్‌లో పవన్‌ కల్యాణ్‌కు సెకండ్ బ్లాక్ 212 రూం కేటాయించినట్టు సమాచారం. పవన్ ఛాంబర్, పేషీ, వ్యక్తిగత సిబ్బంది కోసం మూడు రూంలు కేటాయించినట్లు తెలిసింది.

పవన్‌కు కేటాయించే అవకాశం ఉన్న పేషీలో అందుబాటులో రెండు యాంటీ రూంలు ఉన్నట్లు సమాచారం. పవన్ పేషీలో ఓ మీటింగ్ హాల్, ఓ ప్యాంట్రీ ఉండనుంది. అధికారిక సమీక్షలకు.. సమావేశాలకు అనువుగా పవన్ పేషీ ఉండనుంది. పవన్ కల్యాణ్ పేషీ పక్కనే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేషీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.తమ ముగ్గురికి ఒకే చోట పేషీలు ఇవ్వాలని జీఏడీని జనసేన కోరింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leader Pawan Kalyan took charge as Deputy Chief Minister

You cannot copy content of this page