WhatsApp Image 2024 06 16 at 6.21.13 PM
- నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి విన్నవించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న చెరువులు కుంటలు గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతానికి గురయ్యాయని, వాటిని కబ్జాదారుల నుంచి కాపాడి భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విన్నవించారు.
ఆదివారం ఈ మేరకు ఆయన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసి నియోజకవర్గంలో కబ్జాకు గురైన, గురవుతున్న చెరువులు కుంటల నివేదికను ఆయనకు అందజేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు చెరువులు రూపు కోల్పోయి కబ్జాకు గురయ్యా అని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 126 డివిజన్ అధ్యక్షులు గణేష్ మరియు జితేందర్ గారు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
