జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 15 at 9.30.56 PM

TRINETHRAM NEWS

Child abuse, murder, is painful

నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలి ఇతర దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలను మన దేశంలో అమలు చేయాలి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన నిందితుని బహిరంగంగా ఉరితీయాలని. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిత్యం ఇలాంటి సంఘటనలు ప్రతిచోట జరుగుతూనే ఉన్నాయని అన్నారు. కామంతో కళ్ళు మూసుకొని వయసుతో సంబంధం లేకుండా అత్యాచారలకు పాల్పడడమే కాకుండా హతమార్చడం బాధాకరమని అన్నారు. పక్క దేశాల చట్టాలను మన దేశంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.చిన్నారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, చిన్నారి కుటుంబానికి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ పక్షాన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాము అని చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని సురభి శ్రీధర్ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Child abuse, murder, is painful

You cannot copy content of this page