TRINETHRAM NEWS

Awareness of precautions to be taken to prevent fire accidents in hospitals – Station Fire Officer Srinivas

పెద్దపెల్లి, జూన్ -14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలోని పలు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని పెద్దపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి.శ్రీనివాస్ తెలిపారు.

శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని రామ మెటర్నరీ హాస్పిటల్ , శ్రీనిక చిల్డ్రన్ హాస్పిటల్ నందు వైద్యులకు, వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల గురించి వివరించడం జరిగిందని, ఆసుపత్రి యజమానులకు హాస్పటల్లో కొరతగా ఉన్న అగ్నిమాపక సాధనాలను సమకూర్చవలసిందిగా ఆదేశించడం జరిగిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు.

ఎలక్ట్రికల్ ఫైర్స్ సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ సిస్టమ్, ఎమర్జెన్సీ డోర్ కలిగి ఉండాలని తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రులలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రోగులను రక్షించే విధానం వైద్య సిబ్బందికి వివరించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫైర్ మాన్ కె.శ్రీనివాస్, పి.నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness of precautions to be taken to prevent fire accidents in hospitals - Station Fire Officer Srinivas