జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 07 at 18.29.27

TRINETHRAM NEWS

Pedpadalli MLA Vijjanna visited the double bedrooms

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి పట్టణంలోని హనుమంతుడు పేట రోడ్డు మార్గంలో మరియు చందపల్లి ప్రాంతాల్లో నిర్మించి ఉన్న పలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించి అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించడంతో ఆ ప్రాంతంలో త్రాగునీటి మరియు కరెంటు మరియు డ్రైనేజీ మరియు రోడ్డు లాంటి ప్రధాన సమస్యలు ఉండడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే త్రాగునీటి, డ్రైనేజి,కరెంటు, రోడ్డు మరియు ఇతర సమస్యలు లేకుండా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

అతి తొందరలోనే పూర్తి స్థాయిలో పనులు అన్నీ పూర్తి చేసి అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, విద్యుత్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pedpadalli MLA Vijjanna visited the double bedrooms

You cannot copy content of this page